Dr BS Bajaj passes away: డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం

Arun Chilukuri
Published on: 28 July 2020 2:26 PM IST
Dr BS Bajaj passes away: డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం
X

Dr BS Bajaj passes away: బయోటెక్ రంగ ప్రముఖుడు డాక్టర్ బీఎస్ బజాజ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 93 ఏళ్లు. బీఎస్ బజాజ్ మృతి చెందడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడిన బీఎస్ బజాజ్, జీనోమ్ వ్యాలీ, బయో ఆసియా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కీర్తించారు. బజాజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ స్పందిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ సీఎంవో త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌త ఏడాది జ‌రిగిన బ‌యో ఏషియా స‌ద‌స్సులో డాక్ట‌ర్ బ‌జాజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు అంద‌జేసిన‌ట్లు కూడా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story