Lingojiguda Division: గ్రేటర్‌లో బీజేపీకి షాకిచ్చిన హస్తం పార్టీ

Lingojiguda Division: బీజేపీ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

Kranthi
Published on: 3 May 2021 3:41 PM IST
Big Shock to BJP in GHMC by Election
X

బీజీపీ ప్రతీకాత్మక చిత్రం 

Lingojiguda Division: ఏప్రిల్ నెల 30వ తేదిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో జ‌రిగిన ఏకైక ఉప ఎన్నిక‌లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. వివరాల్లోకి వెళితే... గతేడాది జరిగిన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేయకముందే ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం అయియంది.

అయితే అది బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్‌ఎస్ తరఫున పోటీలో నిలపవద్దని పలువురు బీజేపీ నేతలు కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది.సమీప బీజేపీ అభ్యర్థి అఖిల్ పవన్ గౌడ్‌పై 1200కు పైగా మెజార్టీతో రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల బలం మూడుకు చేరింది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉండని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Kranthi

Kranthi

Next Story