మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు

సెప్టెంబర్ 5న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన కోర్ట్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2024 9:43 PM IST
Bhupalpally Principal Sessions Court notice to former CM KCR
X

మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు 

మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్‌ దాఖలు చేయటంతో కేసీఆర్‌కు నోటీసులు ఇష్యూ చేసింది. కేసీఆర్, హరీష్‌రావుతో పాటు మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది సెషన్స్ కోర్ట్. ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాలేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరి రామ్, శ్రీధర్, మెగా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టి కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్‌కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story