Harish Rao: ఎడ్యుకేషనల్‌ సొసైటీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

Harish Rao: రాజ్‌బహుదూర్‌ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ విస్తరణ

Dhatripriya
Published on: 2 Feb 2023 7:30 PM IST
Bhumi Pooja For The Construction Of Educational Society
X

Harish Rao: ఎడ్యుకేషనల్‌ సొసైటీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

Harish Rao: రాజ్‌బహుదూర్‌ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజ్‌ బహుదూర్ వెంకట్రామ్‌రెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్‌ సొసైటీ విస్తరణలో భాగంగా నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎడ్యుకేషన్‌ సొసైటీ విస్తరణకు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం కేసీఆర్‌ తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. బాలికల విద్య కోసం రాజ్‌బహుదూర్‌ వెంకటరామిరెడ్డి చేసిన కృషి ఈరోజు ఎంతోమంది గ్రామీణ విద్యార్థినులకు అవకాశాన్ని కల్పించిందన్నారు. డబ్బులు సాధించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని కోరుకుంటున్నానన్నారు మంత్రి హరీష్‌రావు.

Dhatripriya

Dhatripriya

Next Story