వైకుంఠ ధామ నిర్మాణానికి భూమిపూజ

వైకుంఠ ధామ నిర్మాణానికి భూమిపూజ
x
Representational image
Highlights

మండలంలోని కొండాపూర్ గ్రామంలో నిర్మించనున్న వైకుంఠ ధామ నిర్మాణానికి ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు.

నిర్మల్: మండలంలోని కొండాపూర్ గ్రామంలో తొమ్మిది లక్షలతో నిర్మించనున్న వైకుంఠ ధామ నిర్మాణానికి ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రజలు వైకుంఠ ధామాలను నిర్మించుకోవాలన్నారు.

సంక్షేమ పథకాలు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎసిఎస్ ఛైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీదర్ రెడ్డి, సర్పంచ్ నావద్ గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories