Nagarkurnool: నేడు రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు

S. Srikanth
Updated on: 5 Feb 2020 11:55 AM IST
Nagarkurnool: నేడు రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు
X

నాగర్ కర్నూల్: పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మార్గశిర మాసం భీష్మ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని, బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో ప్రత్యేకంగా శ్రీ విష్ణు సహస్ర పారాయణం సామూహికంగా పదకొండుసార్లు పఠనం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.

భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్ర పారాయణం చేయడంతో అత్యంత పుణ్య ఫలితం ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదలతోపాటు ఉపవాసం ఉన్నవారికి, భక్తులకు పండ్లు, అల్పాహారం, వసతి నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ భక్తులచే కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. మరిన్ని వివరాలకు 9440075238 సంప్రదించాలని కోరారు.


S. Srikanth

S. Srikanth

Next Story