Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి పీపుల్స్‌ మార్చ్

Bhatti Vikramarka: చింతకాని మండలంలో భట్టి పాదయాత్ర

Rama Rao
Updated on: 27 March 2022 1:30 PM IST
Bhatti Vikramarka Reached Chintakani By Peoples March | Telugu Latest News
X

Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి పీపుల్స్‌ మార్చ్

Bhatti Vikramarka: ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ కొనసాగుతోంది. ఇవాళ చింతకాని మండలం గాంధీనగర్‌ నుంచి రామకృష్ణాపురం, బసవాపురం, కొదుమూరు గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. రామకృష్ణాపురంలో భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. డప్పు, డోలు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో భట్టికి ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. దారి అంతటా బంతిపూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. ప్రజల సమస్యలు ఆలకిస్తూ.. ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు. ఇక రాత్రికి కొదుమూరులో బస చేయనున్నారు భట్టి.

Rama Rao

Rama Rao

Next Story