Bhatti Vikramarka: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే లబ్ది జరిగింది

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన భట్టి

Jyothi
Published on: 6 May 2023 8:32 AM IST
Bhatti Vikramarka Comments On KCR
X

Bhatti Vikramarka: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే లబ్ది జరిగింది 

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రాజెక్టుల పేరుతో పేద ప్రజల భూములను లాక్కుంటూ.. వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే లబ్ది జరిగిందని అన్నారు.

2023లో ఇందిరమ్మ రాజ్యం తేవాలనే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నానన్న భట్టి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఇళ్లు లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అమ్మ హస్తం పేరుతో 9 రకాలు వస్తువులను పంపిణీ చేస్తామన్నారు. అలాగే.. వంట గ్యాస్‌ను 500 రూపాయలకే ఇస్తామని, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు భట్టి.

Jyothi

Jyothi

Next Story