Bhatti Vikramarka: ప్రభుత్వ భూములు కాపాడాల్సిన వారే అమ్ముకుంటున్నారు

Bhatti Vikramarka: అధికారం ఇచ్చింది భూములు అమ్ముకోవడానికా..?

Jyothi
Published on: 4 Aug 2023 12:08 PM IST
Bhatti Vikramarka Comments On BRS Govt
X

Bhatti Vikramarka: ప్రభుత్వ భూములు కాపాడాల్సిన వారే అమ్ముకుంటున్నారు

Bhatti Vikramarka: ప్రభుత్వానికి భూములు కాపాడండి అని ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ కేసీఆర్.. భూములు అమ్ముకోవడానికే తనకు హక్కు ఇచ్చారన్నట్లుగా వ్యవరిస్తున్నారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇన్నాళ్లు ప్రభుత్వ భూములను కాపాడామని... ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంటోందని, భూముల అమ్మకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆ నాయకులే అడ్డుకున్నారని.. ఇప్పుడు అమ్మకానికి పెట్టారని ఆరోపించారాయన.. ప్రభుత్వ భూములు అమ్మకం అయిపోగానే... ప్రజల ఆస్తులను కూడా అమ్ముతారని హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని, ప్రజలు ఆలోచించాలని, ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయడానికి భూములు అమ్ముకుంటుందని భట్టి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలోకి 15 మంది కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడుగు పెడతారా ? అంటూ... అంతకు మించి అసెంబ్లీకి రారని భట్టి జోస్యం చెప్పారు.

Jyothi

Jyothi

Next Story