కాంగ్రెస్ పార్టీలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు

Tellam Venkata Rao: తెల్లం వెంకట్ రావుకు కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Jyothi
Published on: 7 April 2024 12:48 PM IST
Bhadrachalam MLA Tellam Venkata Rao joined the Congress party
X

కాంగ్రెస్ పార్టీలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు

Tellam Venkata Rao: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కారును దిగి హస్తం పార్టీలో చేరారు. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎట్టకేలకు హస్తం గూటికి చేరారు. తెల్లం వెంకటరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిన్నటి కాంగ్రెస్ జనజాతర సభలో సైతం తెల్లం వెంకట్ రావు పాల్గొన్నారు. తెల్లం వెంకట రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు.

Jyothi

Jyothi

Next Story