సీఎం రేవంత్‌తో BFSI ప్రతినిధుల భేటీ

Revanth Reddy: శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి అత్యంత కీలకం

Jyothi
Updated on: 1 Feb 2024 9:16 AM IST
BFSI Representatives Meeting with CM Revanth Reddy
X

సీఎం రేవంత్‌తో BFSI ప్రతినిధుల భేటీ

Revanth Reddy: బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ BFSI కన్సార్టియం ప్రతినిధులు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి అత్యంత కీలకమని, తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్, బిజినెస్ రంగాల్లో సాంకేతిక నిపుణుల తయారీకి కన్సార్టియం కీలక పాత్ర పోషించాలని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయిదు వేల మంది ఇంజనీరింగ్, అయిదు వేల మంది బిజినెస్ గ్రాడ్యుయేట్ లను తగిన సాంకేతిక శిక్షణను ఇచ్చేందుకు BFSI సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తగిన ప్రోగ్రాం​లు, , శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు బీఎఫ్ఎస్ఐ ప్రత్యేకంగా చొరవ చూపుతోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక, వ్యాపార వాణిజ్య విద్యలో ఉన్న అంతరాలను పరిష్కరిస్తుంది. అందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధి రమేష్ కాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరినీ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణను అందిస్తామని అన్నారు.

త్వరలోనే కన్సార్టియం తరఫున అవసరమైన అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, బిఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులు రమేష్‌ కాజా, మమత మాదిరెడ్డి, రాజేష్‌ బాలరాజు, సుబ్బా పెరెపా, రవి తంగిరాల తదితరులు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story