Telangana: బ్యాంకు సిబ్బంది దౌర్జన్యం.. లోన్ కట్టలేదని.. రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు..
Telangana: మహబూబాబాద్ జిల్లాలో బ్యాంకు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు.
Telangana: బ్యాంకు సిబ్బంది దౌర్జన్యం.. లోన్ కట్టలేదని.. రైతు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు..
Telangana: మహబూబాబాద్ జిల్లాలో బ్యాంకు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. లోన్ డబ్బులు కట్టలేదని ఓ ఇంట్లో సామాగ్రిని, ఇంటి తలుపులను తీసుకెళ్లారు. ఈ ఘటన మదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది. 2021లో మోహన్ అనే రైతు సహకార బ్యాంకు నుంచి వ్యవసాయ ఋణం తీసుకున్నాడు. మూడు నెలల నుంచి నెలవారి వాయిదాలు కట్టకపోవడంతో మోహన్ కుమారుడు ఇంటికి వెళ్లారు సహకార బ్యాంకు సిబ్బంది. పోలీస్ సిబ్బందితో వెళ్లి సామాగ్రి తీసుకొని వెళ్లారు. విషయం తెలుసుకున్న డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే బాధితుడి ఇంటి సామాగ్రిని అప్పగించారు బ్యాంకు సిబ్బంది.
Next Story




