Kamareddy: రైతుల పొలాల్లో బ్యాంకు ఫ్లెక్సీలు

Kamareddy: కామారెడ్డి జిల్లాలోని రైతుల పొలాల్లో డీసీసీబీ బ్యాంకుకు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Jun 2024 10:15 AM IST
Bank Flexi at Farmers Land in Kamareddy
X

Kamareddy: రైతుల పొలాల్లో బ్యాంకు ఫ్లెక్సీలు

Kamareddy: కామారెడ్డి జిల్లాలోని రైతుల పొలాల్లో డీసీసీబీ బ్యాంకుకు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదంటూ బ్యాంకు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. లింగంపేట్ మండలం పోల్కంపేట్, పర్మల్ల, షట్‌పల్లి, సంగారెడ్డి గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించని కారణంగా పొలాలను వేలం వేస్తామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వడ్డీ రేటు తగ్గిస్తే రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు అధికారులేమో వడ్డీ రేట్లు తక్కువ చేసే ప్రసక్తే లేదంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story