సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ఆ రోజులు వస్తాయని హెచ్చరిక..

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 27 March 2023 4:34 PM IST
Bandi Sanjay Letter To CM KCR About Govt Employees Problems
X

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ఆ రోజులు వస్తాయని హెచ్చరిక..

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆ లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఆర్టిజన్లు, ఉద్యోగుల పట్ల విద్యుత్‌ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్‌ కనీసం శ్రద్ధ చూపకపోవడం.. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ వ్యతిరేక వైఖరిని కనబరుస్తుందన్నారు.

GPF, PRC వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు బండి సంజయ్. 1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్‌ సంస్థల్లో నియమితులైన వారికి GPF సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లు న్యాయబద్ధమైనవని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన DA బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయన్న సంజయ్.. కొత్త PRC గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. ఒకవేళ ఈ సమస్యల్ని పరష్కరించకపోతే.. తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story