నాపై దాడి అంశాన్ని పార్లమెంట్‌ ప్రివిలైజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తా : ఎంపీ బండి సంజయ్

admin1
Updated on: 1 Nov 2019 8:58 PM IST
నాపై దాడి అంశాన్ని పార్లమెంట్‌ ప్రివిలైజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తా  : ఎంపీ బండి సంజయ్
X

తనపై జరిగిన దాడి విషయాన్ని పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని.. హెచ్‌ఎంటీవీతో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్‌గా ఉందన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేదని తేల్చిచెప్పారు. ఇటు ఈ అంశంపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై వివరాలను సేకరించారు.

admin1

admin1

Next Story