Bandi Sanjay: అర్వింద్ వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే భయపడుతున్నారు
Bandi Sanjay: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పరామర్శించిన బండి సంజయ్
Bandi Sanjay: అర్వింద్ వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే భయపడుతున్నారు
Bandi Sanjay: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్వింద్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్ దాడి జరిగిన పరిసరాలను పరిశీలించారు. దాడి ఎందుకు చేశారో అర్థం కావడం లేదని అన్నారు. దాడి జరిగిన సమయంలో డీఎస్ ఇంట్లో లేకపోవడం అదృష్టమన్నారు. ఫోబియా వల్లే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్ బూతులు మాట్లాడలేదని చెప్పారు. ఇంటిపై మా పార్టీ వాళ్ళు దాడి చేసినా నేను సహించను. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? మీ అయ్య ఇస్తాడా? అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story




