Bandi Sanjay: కావాలనే కేసీఆర్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది..

Bandi Sanjay: రాష్ట్ర గవర్నర్‌ను ప్రభుత్వం బదనాం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 30 Jan 2023 7:30 PM IST
Bandi Sanjay Slams BRS Government
X

Bandi Sanjay: కావాలనే కేసీఆర్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది..

Bandi Sanjay: రాష్ట్ర గవర్నర్‌ను ప్రభుత్వం బదనాం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను పిలిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఉన్నప్పటికీ..కావాలనే కేసీఆర్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిందన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఫైల్ ఎంతవరకు వచ్చిందో స్పీకర్ చెప్పాలన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. లక్డీకపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌ను పరామర్శించిన బండి సంజయ్..తెలంగాణ ప్రభుత్వం..ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story