Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా? ఇన్ని వేల కోట్లు..

Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా?

Arun Chilukuri
Updated on: 4 April 2023 7:30 PM IST
Bandi Sanjay Sensational Alligations on CM KCR Assets
X

Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా? ఇన్ని వేల కోట్లు..

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. 8 ఏళ్ల క్రితం నందినగర్‌లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్‌కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టెర్రరిస్టు, ఇతర సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తూనే...కేసీఆర్ ఆస్తులపై.. తక్షణమే సంబంధిత ఏజెన్సీ సంస్థలన్నీ సమగ్ర విచారణ జరపాలని కోరారు సంజయ్. ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే తగిన జవాబు ఇస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, మోదీ విద్యార్హతల సర్టిఫికెట్ నేపథ్యంలోనూ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ తన విద్యార్హతల సర్టిఫికెట్ ను బయటపెట్టాలని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story