Bandi Sanjay: రేపు కరీంనగర్‌లో బండి సంజయ్ రైతు దీక్ష

Bandi Sanjay: రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం కోసం డిమాండ్

Jyothi
Published on: 1 April 2024 11:09 AM IST
Bandi Sanjay Rythu Deeksha in Karimnagar tomorrow
X

Bandi Sanjay: రేపు కరీంనగర్‌లో బండి సంజయ్ రైతు దీక్ష

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన‎ హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆయన ఈ దీక్షకు రెడీ అయ్యారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్‌తో దీక్ష కొనసాగించనున్నారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేయనున్నారు. అటు వడ్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వడ్ల కల్లాల వద్దే రైతులతో కలిసి బస చేయనున్నారు బండి సంజయ్. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story