Bandi Sanjay: కేసీఆర్‌ను గద్దెదించకపోతే తెలంగాణకు శ్రీలంక పరిస్థితి

Bandi Sanjay Powerfull Speech in BJP Chalo Tukkuguda Public Meeting
x

Bandi Sanjay: కేసీఆర్‌ను గద్దెదించకపోతే తెలంగాణకు శ్రీలంక పరిస్థితి

Highlights

BJP Chalo Tukkuguda: హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేశారు.

BJP Chalo Tukkuguda: హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేశారు. బీజేపీ కార్యకర్తలు తెగించి పోరాడి గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని విమర్శించారు. దళితులకు రాజ్యాధికారం అప్పగిస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పేదల బతుకులను రోడ్డున పడేశారని మండిపడ్డారు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఒకే కుటుంబం పాలించిన శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో చూడండి. కీలక శాఖలన్నీ కల్వకుటుంబం కుటుంబం చేతుల్లోనే ఉంది. కేసీఆర్‌ పాలన పోకపోతే మనకూ శ్రీలంక పరిస్థితే దాపురిస్తుంది. కేసీఆర్ సర్కార్ తీరుతో మోసపోయి, విసిగిపోయిన ప్రజలను కాపాడుకునే బాధ్యత బీజేపీదేనన్నారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories