Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర సన్నివేశం..ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, కవిత

Nizamabad: అన్నా నమస్తే అంటూ బండిని పలకరించిన కవిత

Jyothi
Published on: 31 May 2023 3:42 PM IST
Bandi Sanjay Meets MLC Kavita at Funtion in Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర సన్నివేశం..ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, కవిత

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలున్న పార్టీల నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. లక్ష్మీ నరసయ్య ఇంటికి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హాజరవగా.. అదే సమయంలో ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడకు వెళ్లారు. ఇద్దరు నేతలు ఎదురుపడిన సమయంలో బండి సంజయ్, ఎమ్మెల్సీ కవితలు అభివాదం చేసుకున్నారు. అన్న నమస్తే అని బండిని కవిత సంభోదించగా.. అక్కా నమస్తే అని ప్రతి నమస్కారం చేశారు బండి సంజయ్‌. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జడ్పి చైర్మన్ విఠల్ రావ్ తో పాటు బీఆర్ ఎస్ కార్పొరేటర్లను బండి సంజయ్‌కు ఎమ్మెల్సీ కవిత పరిచయం చేశారు.

Jyothi

Jyothi

Next Story