Bandi Sanjay: సిరిసిల్ల నేతన్నల సమస్యలపై కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: 15 ఏళ్లుగా నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 July 2024 7:08 PM IST
Bandi Sanjay counter to KTR in Sircilla Nethanna issues
X

Bandi Sanjay: సిరిసిల్ల నేతన్నల సమస్యలపై కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ 

Bandi Sanjay: ఇన్నాళ్లకైనా సిరిసిల్ల నేతన్నల సమస్యలను గుర్తించినందుకు సంతోషం అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు. 15 ఏళ్లుగా సిరిసిల్లకు మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 15 ఏళ్లుగా నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. నాటి నుంచి సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఆ నేతన్నల కోసం మీరు చేసిందేమిటి..? అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు బండి సంజయ్.

బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్ లూమ్‌ సంస్థలు మూతపడేలా చేసింది మీరు కాదా..? అని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. కరెంట్ సబ్సిడీలను బంద్ చేసి పవర్ లూం సంస్థల ఉసురు తీసింది మీరు కాదా..? అంటూ కేటీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు. సిరిసిల్లలో మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఎందుకు ఏర్పాటు చేయించలేక పోయారు? ఆనాడు మీ ప్రభుత్వం సహకరించి ఉంటే సిరిసిల్లలో మెగా పవర్ లూం పార్క్ ఎప్పుడో ఏర్పాటయ్యేదన్నారు బండి సంజయ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story