Bandi Sanjay: రామాలయం కూల్చి.. బాబ్రీమసీద్ నిర్మిస్తామని చెప్పే ధైర్యముందా?

Bandi Sanjay: దేశాన్ని విభజించి పాలించడమే కాంగ్రెస్ విధానం

Shekhar G
Published on: 3 Feb 2024 3:30 PM IST
Bandi Sanjay Comments On Congress
X

Bandi Sanjay: రామాలయం కూల్చి.. బాబ్రీమసీద్ నిర్మిస్తామని చెప్పే ధైర్యముందా?

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రామాలయానికి బీజేపీ అనుకూలంగా ఉంది... కాంగ్రెస్ ఉందా అంటూ సవాల్ చేశారు. రామాలయాన్ని కూల్చి.. బాబ్రీ మసీద్ కడుతామని చెప్పే దమ్ము కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ఉందా అంటూ సవాల్ విసిరారు. దేశాన్ని విభజించడం. పాలించడమే కాంగ్రెస్ విధానమంటూ ఆరోపించారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుండడంతోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story