Bandi Sanjay: హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Jyothi
Published on: 2 Jan 2023 6:26 AM IST
Bandi Sanjay Comments On CM KCR
X

Bandi Sanjay: హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. PFI వంటి నిషేధ సంస్థలను కేసీఆర్ వాడుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ పోలింగ్ బూత్ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదో చెప్పండి అని బండి సంజయ్ ప్రశ్నించారు. NIA సోదాలు చేస్తే హైదరాబాద్‌లో 11 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారని, ఉగ్రవాదులకు తెలంగాణ అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. అధికారం పోతుందంటే PFI వంటి నిషేధ సంస్థలను.. రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story