మండలి వైస్ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక

* ఉదయం 10 గంటలకు వైస్ చైర్మన్ పదవి ఎన్నిక ఫలితం

Dhatripriya
Published on: 12 Feb 2023 10:07 AM IST
Banda Prakash Was Unanimously Elected For Vice Chairman Of The Council
X

మండలి వైస్ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక

Banda Prakash: తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడిగా పూర్వ వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ పదవికి నిన్న సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసే సరికి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు నేడు ప్రకటించనున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీతో కలిసి బండా ప్రకాశ్‌ నామినేషన్‌ పత్రాలను శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల అధికారి నరసింహాచార్యులుకు ఆయన కార్యాలయంలో అందజేశారు. కాగా నేడు ఉదయం శాసనమండలిలో ఉదయం 10 గంటలకు ఉపాధ్యక్ష పదవి ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. అనంతరం ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Dhatripriya

Dhatripriya

Next Story