Balka Suman: తుక్కుగూడ కాంగ్రెస్ సభపై బాల్క సుమన్ విమర్శలు

Balka Suman: రాహుల్ నోటితో అబద్దాలు పలికించిన కాంగ్రెస్ నేతలు

Shashank Gullapelli
Published on: 10 April 2024 5:47 PM IST
Balka Suman Comments On Tukkuguda Congress Sabha
X

Balka Suman: తుక్కుగూడ కాంగ్రెస్ సభపై బాల్క సుమన్ విమర్శలు

Balka Suman: తెలంగాణ కాంగ్రెస్ నేతలు తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ చే పచ్చి అబద్దాలు మాట్లాడించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఏం తెలియని రాహుల్ గాంధి రేవంత్ రెడ్డి ఏం చెబితే అది మాట్లాడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేశషన్ ఇచ్చామని.. వీచికి మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలరెండర్ పేరిట మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ తీరును నిరుద్యోగ యువకులు గమనిస్తున్నారని అన్నారు. పచ్చి అబద్దాలు.. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story