Baby Dead Body Missing: పహాడిషరీఫ్ స్మశానంలో పూడ్చిపెట్టిన శిశువు మాయం

Baby Dead Body Missing: సల్మాన్, సనబేగం దంపతులకు పుట్టిన బాబు మృతి * వారం రోజుల తర్వాత సమాధిపైన తొలగిన బండలు

Sandeep Eggoju
Published on: 10 July 2021 5:12 PM IST
Baby dead Body Missing After Bury From Pahadi Shareef Graveyard in Hyderabad
X

హైదరాబాద్‌ పహాడిషరీఫ్ స్మశానంలో పూడ్చిపెట్టిన శిశువు మాయం

Baby Dead Body Missing: హైదరాబాద్ పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పహాడి షరీఫ్‌లోని మూస కాలనీలో నివాసముంటున్న సల్మాన్, సనబేగం దంపతులకు ఈనెల 3న బాబు పుట్టాడు. అయితే.. బాబు గర్భంలోనే చనిపోయాడు. ప్రసవం తర్వాత బాబును పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ స్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యులు సమాధి దగ్గరకు వెళ్లి చూశారు. సమాధిపై మట్టి లేకపోవడంతో.. అనుమానం వచ్చి సమాధిని తొవ్వి చూశారు. పసికందు మృతదేహం కనిపించకుండా పోయింది..

పసికందు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు.. ఎందుకు తీసుకెళ్లారనేది అంతుచిక్కని మిస్టరీగా మారింది. అయితే.. పూడ్చి పెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంపై బంధువులు, కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడ పసికందు మృతదేహం కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కల నిర్మానుష్య ప్రాంతం కావడంతో.. కుక్కలు గాని ఇతర జంతువులు తీసుకెళ్లాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story