బీజేపీ కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం.. నువ్వెంత.. నీ బతుకెంత..?

Babu Mohan Audio: ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్.. జోగిపేట బీజేపీ కార్యకర్తతో బూతు పురాణం లంకించుకున్నాడు.

Arun Chilukuri
Updated on: 7 Feb 2023 11:18 AM IST
Babu Mohan Foul Mouths on BJP Activists
X

బీజేపీ కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం.. నువ్వెంత.. నీ బతుకెంత..?

Babu Mohan Audio: ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్.. జోగిపేట బీజేపీ కార్యకర్తతో బూతు పురాణం లంకించుకున్నాడు. నువ్వెంత.. నీ బతుకెంత..? అంటూ బీజేపీ కార్యకర్త వెంకటరమణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు గల్లీ లీడర్‌వి.. నేను రాష్ట్ర నాయకుడిని అంటూ.. మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం అని వెంకటరమణకు బాబు మోహన్ సవాల్ విసిరారు. చివరికి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని సైతం విడిచిపెట్టలేదు. కావాలంటే తాను బీజేపీకి రాజీనామా కూడా చేస్తానన్నారు. బాబు మోహన్ - బీజేపీ కార్యకర్త వెంకటరమణ మధ్య జరిగిన కాల్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story