వరంగల్ అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆస్ట్రేలియా యువతి

వరంగల్ అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆస్ట్రేలియా యువతి
x
Dinesh, Demi
Highlights

ప్రేమకు కుల, మతాలే కాదు..ఎల్లలూ కూడా అడ్డుకావని నిరూపించారు.వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన అబ్బాయి దినేష్.

వరంగల్: ప్రేమకు కుల, మతాలే కాదు... ఎల్లలూ కూడా అడ్డుకావని నిరూపించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన అబ్బాయి దినేష్. ఆస్ట్రేలియాకు చెందిన అమ్మాయి కేవలం ప్రేమే కాదండోయ్ పెళ్లి కూడా చేసుకొని ఒక్కటైపోయారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లో నివాసం ఉంటున్న ఉమామహేశ్వర రావు, విజయకుమారి దంపతుల ఏకైక కుమారుడు దినేష్ వరంగల్ ఉర్సు తాళ్ళ పద్మావతి కళాశాలలో ఫార్మాసీ చదువుకొని పై తరగతుల నిమిత్తం ఆస్ట్రేలియా కు వెళ్లి విద్యాభ్యాసం చేసాడు. అక్కడే డేమి అనే యువతి పరిచయం కావడంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, వీరి పెళ్లి కోసం సంవత్సరం నుండి ప్లాన్ చేశామని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేశామని దినేష్ తండ్రి ఉమామహేశ్వర రావు తెలిపారు.

కులం, మతం, రంగు, భాష.. ఇలాంటివేవీ ప్రేమకు అడ్డుకావని మరోసారి నిరూపించారు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హన్మకొండకు చెందిన దినేష్ బాబు చదువు నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే డెమీ పరిచయం అయింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యామని దినేష్ తెలిపారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. విదేశీ వధువు తెలుగు సంప్రదాయ పద్థతిలో చీరకట్టుకొని అందంగా ముస్తాబయింది. బంధు మిత్రులతో పాటు.. పలువురు విదేశీ అతిథులు కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, చాలా గొప్పవని వధువు డెమీ మార్గెరెట్ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories