Warangal: తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని.. ఇంటికి నిప్పుపెట్టిన గ్రామ సర్పంచ్

Warangal: అదే గ్రామానికి చెందిన రంజిత్ తో సర్పంచ్ కూతురు కావ్య..

Shekhar G
Published on: 5 July 2023 3:02 PM IST
Atrocity In Itikalapalli Of Warangal District
X

Warangal: తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని.. ఇంటికి నిప్పుపెట్టిన గ్రామ సర్పంచ్

Warangal: ప్రేమ వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి యువకుడి ఇంటికి నిప్పంటించిన ఘటన వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో చోటుచేసుకుంది. నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల రంజిత్ కావ్యలు ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి రవీందర్ హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు.

అయితే కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బ్రతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహించిన రవీందర్ ,రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు మిత్రుల ఇండ్లకు నిప్పంటించాడు. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story