ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై ATF ఫిర్యాదు

ATF: తీవ్రవాదంపై పోరులో పోలీసు బలగాల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుంది

Shekhar G
Published on: 8 Aug 2023 8:04 AM IST
ATF Complaint Over Funeral Of Folk Singer Gaddar
X

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై ATF ఫిర్యాదు

ATF: గద్దర్ కు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత రాష్ట్రపతికి మరియు రాష్ట్ర గవర్నర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని యాంటి టెర్రరిజం ఫోరం కన్వీనర్ డాక్టర్ రావినూతల శశిధర్ తెలిపారు. నిషేదిత మావోయిస్టు భావజాలానికి సిద్ధాంత కర్త అయిన గద్దర్ అంతిమ సంస్కారం లో పోలీసులతో గన్ సెల్యూట్ చేయించడం తీవ్రవాదం పై పోరులో పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది . తెలంగాణా ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చను తెస్తుంది . నక్సలైట్ల మారణహోమం లో బలిదానాలు చేసిన పోలీసుల, జాతీయవాదుల త్యాగాలను తెలంగాణా ప్రభుత్వం అవమాన పరిచింది. గద్దర్ అంతిమయాత్ర చూస్తే అర్బన్ నక్సలైట్లు ఏ రకమైన ఏకో సిస్టం నిర్మాణం చేసుకున్నారో అర్థం అవుతుందని యాంటి టెర్రరిజం ఫోరం కన్వీనర్ .డాక్టర్ రావినూతల శశిధర్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

Shekhar G

Shekhar G

Next Story