Karimnagar: కోవిడ్ -19 ముఖ్యమంత్రి సహాయ నిధికి అరోరా డిగ్రీ కళాశాల విరాళం

S. Srikanth
Published on: 8 April 2020 10:35 PM IST
Karimnagar: కోవిడ్ -19 ముఖ్యమంత్రి సహాయ నిధికి అరోరా డిగ్రీ కళాశాల విరాళం
X

కరీంనగర్ టౌన్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని, తుది ముట్టిచెందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు స్పందించి, కరీంనగర్ లో గల అరోరా డిగ్రీ కళాశాల తనవంతు సహాయం అందించేందుకు బుధవారం రోజున కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ శశాంకకి, అరోరా కళాశాల చైర్మన్ ఎం.వి. శేఖర్, డైరెక్టర్ శ్రీ ఏ. దామోదర్ రెడ్డి గార్లు , కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు సమక్షంలో (50,000) యాబై వేల రూపాయల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహాయ సహారాలను అందజేసిన, కళాశాల యాజమన్యంను, అధ్యాపక బృందంను కలెక్టర్, మేయర్ లు అభినందించారు. అంతకముందు ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన విపత్తులకు స్పందించి అరోరా డిగ్రీ కళాశాల తమ ఔదార్యాన్ని చాటుకుంది.


S. Srikanth

S. Srikanth

Next Story