Hyderabad: ప్రేమ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్

Hyderabad: ప్రేమంటుంది.. నువ్వు లేకుండా ఉండలేనంటుంది.. మత్తుగా ట్రాప్‌లో దించేస్తుంది.

Venkata Chari
Updated on: 18 May 2021 4:15 PM IST
AR Constable Trapping Young People
X

ప్రేమ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్నఏఆర్ కానిస్టేబుల్ (ఫొటో ట్విట్టర్)

Hyderabad: ప్రేమంటుంది.. నువ్వు లేకుండా ఉండలేనంటుంది.. మత్తుగా ట్రాప్‌లో దించేస్తుంది. తీరా వివాహం చేసుకున్నాక అసలు రంగు బయట పెడుతుంది. హైదరాబాద్‌లో మహిళా ఏఆర్ కానిస్టేబుల్ హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. సంధ్య రాణి అనే ఏఆర్ కానిస్టేబుల్ డబ్బు ఉన్న వారిని ప్రేమ పేరుతో టార్గెట్ చేస్తోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు చెప్పి పలువురిపై బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తోంది. అంతేకాకుండా గతంలో ముగ్గురిని వివాహం చేసుకుని డివోర్స్ ఇచ్చింది. తాజాగా షాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ ఫిర్యాదుతో లేడీ కిలాడీ గుట్టు రట్టయింది.

గతంలో ముగ్గురితో వివాహం జరగగా ఇద్దరికి విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వ్యక్తి ఈ కిలాడీ టార్టర్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాజాగా ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు చరణ్ తేజ్‌ను ప్రేమ పేరుతో దగ్గర చేసుకుని వివాహం చేసుకుంది. అనంతరం ఆమె అసలు రంగు బయటపడడంతో ఆమె నుంచి కాపాడండి అంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్య రాణి ట్రాప్‌లో మరికొందరు యువకులు ఉన్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కలవనీయడం లేదని వాపోయాడు.

గతంలో సంధ్యారాణి వరుస పెళ్లిళ్లపై ఆమె తల్లిదండ్రులే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నా భయం లేకుండా పలువురితో సన్నిహితంగా ఉంటుందని సంధ్యారాణి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చరణ్ తెలిపాడు. సంధ్య రాణిని డిపార్ట్‌మెంట్ నుంచి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బాధఇతుడు చరణ్ తేజ్ కోరుతున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story