
Raj Bhavan: తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోం వెలవెల.. హాజరుకాని రాజకీయ పార్టీల నేతలు
Raj Bhavan: అరుదైన గౌరవ ఆతిథ్యానికి మొహంచాటేస్తున్న అధికార, ప్రతిపక్షాలు
Raj Bhavan: ఒకప్పట్లో రాజ్ భవన్ ఎట్ హోమ్ అంటే హడావిడి... రాజకీయ ప్రముఖులతో సందడిగా కన్పించే గౌరవప్రద అధికారిక కార్యక్రమం... స్వాతంత్ర్య దినోత్సవం రోజు సాయంత్రంపూట... న్యాయాధికారులు, పాలనాధికారులు, రక్షణ, భద్రతాధికారులకు గౌరవంగా ఆహ్వానించి రాజ్ భవన్ తేనీటి విందుతో ఆతిథ్యమిస్తుంది. ఇపుడు కొన్ని రాజకీయ పరిణామాలతో గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు రాజకీయ ప్రముఖులు దూరమవుతున్నారు. రాజ్ భవన్ గౌరవించి ఆహ్వానించినా... గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు ప్రముఖులు విముఖత చూపుతున్నారు. అందరికీ సాధ్యంకాని... కొందరికే సాధ్యమైనా... అరుదైన గౌరవానికి దూరమవుతున్నారు. దీంతో రాజ్ భవన్‌లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమం చర్చనీయాంశమైంది. రాజకీయ నేతలతో పాటు అధికారులు వచ్చే వాళ్ళు.. గవర్నర్ ఇచ్చే తేనేటి విందులో పాల్గొనే వాళ్ళు.. కానీ కొద్ది రోజులుగా రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోమ్ పై ఎందుకు ఆసక్తి చూపడం లేదు.
రాజ్ భవన్ లో నిర్వహించే ఏ కార్యక్రమం కి అయిన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు ,ఫ్రీడమ్ ఫైటర్స్,వివిధ కేటగిరిలా వాళ్ళు అటెండ్ అవుతారు..రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమం అంటేనే ప్రజలు అందరికి ఆసక్తి ఉండేది..అధికార ప్రతి పక్ష నేతలు ఒకే దగ్గర కలవడం తో వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారనే ఆసక్తి ఉండేది.రాజ్ భవన్ లో రాష్ట్ర ప్రథమ పౌరురాలు నిర్వహించే ఏ కార్యక్రమం కి అయిన అటెండ్ అయ్యే వాళ్ళు..అలాంటిది గత కొద్ది రోజులుగా రాజా భవన్ లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమం కి కూడా ఎవరు అటెండ్ అవ్వక పోవడం తో కళ తప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నవి.
రాజ్ భవన్ ఎట్ హోమ్ కి ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్ ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు, ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారులు హాజరు అయ్యే వాళ్ళు.అందరి రాకతో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగేది..రాజ్ భవన్ ఎట్ హోమ్ అంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది..కానీ గత కొద్ది రోజులుగా నేతలు దూరంగా ఉండడంతో ఎట్ హోమ్ కళ తప్పుతూ వస్తో్ంది.. అధికార ప్రతి పక్ష నేతలను కలుపుకుంటే దాదాపు 300 పైగా నేతలు హజరయ్యేవారు..రాజ్ భవన్ ఎట్ హోమ్ కళ కల లాడేది.
ఈ మధ్య కాలంలో నేతలు ఎవ్వరు కూడా ఎట్ హోమ్ పై ఆసక్తి చూపడం లేదు..తెలంగాణ లో 119 మంది ఎమ్మెల్యే లు ,మాజీ నేతలు,ప్రతి పక్షా పార్టీల నేతలు ఇలా ఎవ్వరు కూడా ఆసక్తి చూపడం లేదు..ఎట్ హోమ్ కి ఆటెండ్ అవ్వక పోవడం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది..తెలంగాణ తొలి మహిళ గవర్నర్ గా తమిళ సై నియమితులు అయిన తరువాత ప్రగతి భవన్ కి రాజ్ భవన్ కి మధ్య గ్యాబ్ పెరుగుతూ వస్తోంది..అప్పటి నుంచి ముఖ్యమంత్రి కానీ కేబినెట్ మినిష్టర్ కానీ,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లు బి ఆర్ ఎస్ నేతలు అటెండ్ అవ్వడం లేదు..కానీ కాంగ్రేస్,బీజేపీ,సీపీఐ, సీపీఎం నేతలు ఎట్ హోమ్ కి అటెండ్ అయ్యే వాళ్ళు..ఈ ఆగస్టు 15 కి జరిగిన ఎట్ హోమ్ కి ఓన్లీ పొలిటికల్ పార్టీ ల నుంచి టీటీడీపీ అధ్యక్షుడు నేతలు మాత్రమే అటెండ్ అయ్యారు..రాజ్ భవన్ నుంచి పిలుపు వెళ్లిన నేతలు రాలేదన్న చర్చ జోరందుకుంది..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు, కూడా ఎవ్వరు అటెండ్ అవ్వలేదు.. కాంగ్రేస్ అధ్యక్షుడు తాజా మాజీ నేతలు కూడా అటెండ్ అవ్వలేదు..ఇలా రాజ్ భవన్ లో.జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి అటెండ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది..

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




