Peddapalli: పెళ్లి చేసుకొని డబ్బు, నగలతో ఉడాయించిన మాయలేడి

PEDDAPALLI: షాదీ డాట్‌ కామ్‌లో రేవంత్‌కు పరిచయమైన అనూష

Shekhar G
Published on: 4 July 2023 1:58 PM IST
Anusha Got Married And  Carried Away With Money And Jewellery
X

PEDDAPALLI: పెళ్లి చేసుకొని డబ్బు, నగలతో ఉడాయించిన మాయలేడి

Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండంలో పెళ్లిపేరుతో యువకులను మోసం చేస్తున్న కిలాడీ లేడీ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అనూష అనే అమ్మాయి పెళ్లి చేసుకొని డబ్బు, నగలుతో ఉడాయించిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాదీ డాట్‌ కామ్‌లో రేవంత్‌కు అనూష పరిచయమైంది. పెళ్లైన రెండు నెలలకే నగలు, డబ్బుతో ఉడాయించింది. దీంతో వరంగల్‌కు వెళ్లి వివరాలు సేకరించిన రేవంత్‌కు అనూష మోసాల గురించి తెలిసింది. అనుషకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్లు రేవంత్ తెలుసుకుని షాక్ అయ్యాడు. మోసపోయానని గ్రహించి ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Shekhar G

Shekhar G

Next Story