Peddapalli: అకౌంట్‌ ఖాళీ.. రూ. 1 లక్షా, 27 వేలు నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Another Victim Of Cybercriminals In Peddapalli
x

Peddapalli: అకౌంట్‌ ఖాళీ.. రూ. 1 లక్షా, 27 వేలు నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Highlights

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ బ్యాంక్‌లో నగదు జమ చేసుకున్న మహిళ

Peddapalli: బ్యాంకులో ఉన్న డబ్బులకు రక్షణ లేకుండా పోయింది. కస్టమర్‌కు తెలియకుండా ఖాతా నుండి నగదు ఖాళీ కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పాత పెట్రోల్ బంక్ ఏరియాలోని రాచకట్ల అనుపమ అనే మహిళ...సుల్తానాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారు. అయితే అనుపమకు తెలియకుండానే 1లక్షా, 27వేల రూపాయలు ఖాతా నుండి తన ప్రమేయం లేకుండానే కట్ అయిపోయాయి. డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే అసలు విషయం బయటపడింది.

తనకు తెలియకుండా డబ్బులు ఎలా కట్ అయ్యాయని... బ్యాంక్ అధికారులను అడగడంతో తంబు ద్వారా తీసుకున్నట్లు ఉందని బ్యాంక్ అధికారులు చెప్పారట. తన కూతురు ఉన్నత చదువు కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కొట్టేయడంతో కన్నీరు మున్నీరుగా విలపోస్తోంది. అనుపమ, ఆన్‌లైన్‌ సైబర్ క్రైమ్‌లో, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories