దివ్య హత్య కేసులో మరో మలుపు

దివ్య హత్య కేసులో మరో మలుపు
x
Highlights

సంచలనం సృష్టించిన గజ్వెల్ బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసు కొలిక్కి వచ్చింది. దివ్యను హత్య చేసినట్లు.. నిందితుడు వెంకటేశ్‌ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంచలనం సృష్టించిన గజ్వెల్ బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసు కొలిక్కి వచ్చింది. దివ్యను హత్య చేసినట్లు.. నిందితుడు వెంకటేశ్‌ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్‌ ను విడుదల చేసిన పోలీసులు వెంకటేశ్ ను జ్యూడిషియల్ రిమాండ్ కు పంపించారు.గత కొంత కాలంగా వేరే అబ్బాయితో చనువుగా ఉంటోందని, దివ్యపై కక్ష పెంచుకున్న వెంకటేశ్ తనకు దక్కనిది వేరొకరికి దక్కొద్దంటూ కోపం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో దివ్యను ఆమె ఉంటున్న అద్దె రూమ్ లో కత్తితో గొంతు కోసి సికింద్రాబాద్ నుంచి రైల్లో విజయవాడకు వెళ్లాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి వేములవాడకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో దివ్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మరోవైపు వెంకటేశ్‌కు గజ్వెల్ ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గజ్వెల్ న్యాయమూర్తి సుచరిత నివాసంలో వెంకటేశ్‌ను హాజరుపర్చారు. వెంకటేశ్‌కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత నిందితుడు వెంకటేశ్‌ను సిద్దిపేట జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories