Telangana: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్‌

Telangana: కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sandeep Eggoju
Updated on: 21 Feb 2021 11:35 AM IST
Another Shock To Congress in Telangana
X

Representational Image

Telangana: రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిన శ్రీశైలం. కూన శ్రీశైలం గౌడ్. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నాను గత మూడు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను 2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిపొందాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా,మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చూశాను గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధకలిగిస్తున్నాయి.

ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైంది ఇవన్నీ చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను,హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని ఒక నిర్ణయానికి వచ్చారు.

దీనికి ఉదాహరణ దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైంది...చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగే కారణం పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను...ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చానునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా TRSపై అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీనే అని నిర్ణయానికి వచ్చాను అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story