పోలీస్ చేతిలో మరో అస్త్రం డ్రోన్ కెమెరా
జిల్లా కేంద్రంలో ఇకపై డ్రోన్ కెమెరా తిరుగనున్నది.
మహబూబాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఇకపై డ్రోన్ కెమెరా తిరుగనున్నది. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేసే వారిపైన, జనసంచారంలేని ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు కోసం డ్రోన్ వాడనున్నట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అన్నారు.
ట్రాఫిక్ క్రమబద్దీకరణకు కూడా ఈ డ్రోన్ ద్వారా పరిశీలించి కార్యాచరణ చేస్తాం అన్నారు. ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్, పక్కదారి పడుతున్న యువతకు సరైన దారిలో పెట్టాలనే ఉదేశ్యంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనసంచారంలేని ప్రదేశాల్లో ఉపయోగిస్తాం అన్నారు. యువత ముఖ్యంగా బహింరంగా ప్రదేశంలో మద్యం సేవించడం, ప్రోగ తాగడం, గంజాయి ఇతర వ్యసనాలకు బానిసలు కాకూడదని అన్నారు.
Next Story




