TS: తెలంగాణలో మరో ఉపఎన్నిక

TS: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి

Shekhar G
Published on: 27 Feb 2024 2:54 PM IST
Another By-Election In Telangana
X

TS:తెలంగాణలో మరో ఉపఎన్నిక 

TS: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎమ్మెల్యేలు మరణించిన తర్వాత ఆయా స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎప్పుడూ ఏకగ్రీవం కాలేదు. ప్రతిసారి ఉప ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరణించిన స్థానాల్లో నారాయణ్ ఖేడ్, పాలేరు, దుబ్బాక స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.

ఇప్పుడు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో లాస్య నందిత కుటుంబానికి బీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే... ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవంగా అయ్యే విధంగా సహకరిస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Shekhar G

Shekhar G

Next Story