Telangana: గొర్రెల పంపిణీ కేసులో మరో ట్విస్ట్‌..

Telangana: అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్‌కు హస్తం ఉన్నట్టు ఏసీబీ గుర్తింపు

Jyothi
Updated on: 3 March 2024 1:45 PM IST
Another Big Twist in the Sheep Scheme Scam Case
X

Telangana: గొర్రెల పంపిణీ కేసులో మరో ట్విస్ట్‌..

Telangana: గొర్రెల పంపిణీ కేసులో మరో ట్విస్ట్‌ బయటపడింది. అవకతవకల్లో మరో జాయింట్‌ డైరెక్టర్‌కు హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వాధికారులను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన నలుగురిని ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించడంతో జాయింట్‌ డైరెక్టర్‌ పాత్ర బయటపడింది. రికార్డ్‌ల్లోకి బినామీ ఖాతాల వివరాలను జేడీ ఎక్కించారు. మొయినుద్దీన్‌ నుంచి జేడీ లక్షల రూపాయలు తీసుకున్నారు. మొయినుద్దీన్‌, అతడి కుమారుడు ఇక్రం రైతుల డబ్బులు తీసుకొని విదేశాలకు పారిపోయారు. జాయింట్‌ డైరెక్టర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు.

Jyothi

Jyothi

Next Story