Congress: కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. చివరి నిమిషంలో మారుతున్న నిర్ణయాలు

Congress: మహబూబాబాద్ స్థానాల అభ్యర్థుల ఎంపిక పెండింగ్

Shekhar G
Published on: 27 Oct 2023 2:33 PM IST
Announcement Of Congress Candidates Soon
X

Congress: కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. చివరి నిమిషంలో మారుతున్న నిర్ణయాలు

Congress: కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే చివరి నిమిషంలో నిర్ణయాలు మారుతున్నాయి. 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖర్గే స్థాయిలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు లిస్ట్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ఒక స్థానంతో మరొక స్థానం ముడిపడి ఉండడంతో నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో ప్రతిష్ఠంభన నెలకొంది. సూర్యాపేట స్థానం రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి దక్కే అవకాశం ఉంది. ఇక మక్తల్, జడ్చర్ల, చెన్నూర్, ఇల్లందు, దేవరకొండ, మహబూబాబాద్ స్థానాల అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పెట్టారు.

Shekhar G

Shekhar G

Next Story