ఆ నలుగురినీ గుర్తించిన రేప్ బాధితురాలు.. ఎమ్మెల్యే కొడుకుపై కేసుకు సన్నాహాలు..

Amnesia Pub Case Victim Identified the Photos of the Accused
x

ఆ నలుగురినీ గుర్తించిన రేప్ బాధితురాలు.. ఎమ్మెల్యే కొడుకుపై కేసుకు సన్నాహాలు..

Highlights

Amnesia Pub Case: బంజారాహిల్స్ అమ్నేషియా పబ్ మైనర్ బాలిక రేప్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు.

Amnesia Pub Case: బంజారాహిల్స్ అమ్నేషియా పబ్ మైనర్ బాలిక రేప్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా షీటీమ్స్ ఆధ్వర్యంలో బాధితురాలి స్టేట్మెంట్ ను మరోసారి రికార్డ్ చేశారు. అమ్మాయి తల్లిదండ్రుల వెర్షన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిందితుల ఫొటోలను గుర్తించిన బాధితురాలు వారంతా కారులో తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పినట్లు సమాచారం. ఇక రేప్ జరిగిన కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నిందితులలో అతన్ని కూడా చేర్చాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మరోసారి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories