బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్ షా కీలక సూచనలు

Amit Shah: బీజేపీ తెలంగాణ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు.

Arun Chilukuri
Published on: 17 Sept 2022 3:15 PM IST
Amit Shahs Key Suggestions for BJP Telangana Leaders
X

బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్ షా కీలక సూచనలు 

Amit Shah: బీజేపీ తెలంగాణ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాలని దిశా నిర్ధేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం త్వరలోనే ఓ కమిటీని నియమించాలని రాష్ట్ర అధినాయకత్వాన్ని ఆదేశించారు. మునుగోడు అన్ని నియోజకవర్గాలపై ఆరా తీసిన అమిత్ షా అధికార టీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలపై దూకుడుగా వెళ్లాలని నేతలకు ఆదేశించారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ నాయకులు ఇంకా కష్టపడితేనే ఫలితం ఉంటుందని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం నేతలకు దిశా నిర్ధేశం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story