Break for US Visas: కరోనా తీవ్రత దృష్ట్యా అమెరికా వీసాలకు బ్రేక్

Break for US Visas: కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ తెలిపింది

Kranthi
Published on: 28 April 2021 7:33 AM IST
Break for US Visas: కరోనా తీవ్రత దృష్ట్యా అమెరికా వీసాలకు బ్రేక్
X

Break for US Visas:(File Image)

Break for US Visas: హైదరాబాద్ లో కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ ప్రకటించింది. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్‌ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది.

అమెరికా సిటిజన్‌ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story