Love Marriage: అమెరికా అమ్మాయి.. మల్యాల అబ్బాయి..

Love Marriage: ప్రేమకు దేశాలు, ఖండాంతరాలు ఉండవు అంటారు.

Arun Chilukuri
Updated on: 14 March 2023 7:00 PM IST
America Girl and Jagtial Guy get Married
X

Love Marriage: అమెరికా అమ్మాయి.. మల్యాల అబ్బాయి..

Love Marriage: ప్రేమకు దేశాలు, ఖండాంతరాలు ఉండవు అంటారు. సరిగ్గా అలాగే మల్యాల అబ్బాయి అమెరికా అమ్మాయి ఒకట్టయ్యారు. పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్ష్యంలోనే వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ముస్కెం ప్రభు ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తుండగా టెక్సాస్ ప్రాంతానికి చెందిన సిసీలియా అనే అమెరికా అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి మనసులు కలవడంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జగిత్యాల పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో వీరి విహావాం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story