అమీన్‌పూర్‌‌ ఘటనలో పోలీసుల రహస్య విచారణ

అమీన్‌పూర్‌‌ ఘటనలో పోలీసుల రహస్య విచారణ
x
Ameenpur Orphanage Case
Highlights

Ameenpur Orphanage Case : అమీన్‌పూర్‌లోని మియాపూర్‌ శివారు ప్రాంతంలోని ఉన్న మారుతి అనాథాశ్రమానికి చెందిన ఓ బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురై ఈనెల 12న నిలోఫర్‌ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Ameenpur Orphanage Case : అమీన్‌పూర్‌లోని మియాపూర్‌ శివారు ప్రాంతంలోని ఉన్న మారుతి అనాథాశ్రమానికి చెందిన ఓ బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురై ఈనెల 12న నిలోఫర్‌ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలికపై వేణుగోపాల్ అనే నిందితుడు అత్యాచారం చేశాడని, అతనికి అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌ అందుకు సహకరించారు. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసుపై పోలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. పోలీస్ కస్టడీలో విచారణ చేసిన విషయాలను బయటకు తెలియకుండా అత్యంత గోప్యంగా విచారణ జరుగుతోంది.

ఈ కేసులో నిందితులను పఠాన్ చెరువు డీఎస్‌పీ ఆశ్రమానికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బాధిత కుటుంబం హైపర్ కమిటీ ముందు హాజరై తమ వాగ్మూలం ఇచ్చింది. ఆశ్రమానికి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఆశ్రమ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోక్సో కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చెయ్యాల్సింది పోయి అధికారులు ఆలస్యం చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇక పోతే అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అయితే ఇంతకు ముందు వేరే చిరునామాతో ఉన్న ఆశ్రమం ఈ చిరునామాలో ఉండడం, అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories