TS inter revaluation results 2020: నేడు ఇంటర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు.. ఈ సైట్‌లో చెక్ చేసుకోండి

Arun Chilukuri
Published on: 29 July 2020 12:18 PM IST
TS inter revaluation results 2020: నేడు ఇంటర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు.. ఈ సైట్‌లో చెక్ చేసుకోండి
X

inter recounting reverification results: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్‌ చేసిన జవాబు పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 37,387 మంది విద్యార్థులు రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 71,298 జవాబు పత్రాలను తిరిగి ధ్రువీకరించారు. మిగతా 1,198 జవాబు పత్రాలు నెలాఖరుకి పూర్తవుతాయని ఇంటర్‌ బోర్డు తెలిపింది. అలాగే సవరించిన మెమోలను ఆగస్టు 1, 2020 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు ప్రకటనలో తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story