ఈనెల 14న అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ

*అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశం

Jyothi
Updated on: 6 April 2023 9:30 PM IST
Ambedkar Statue Inauguration on 14th of this Month
X

ఈనెల 14న అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ

Telangana: ఈనెల 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నిర్వహించనున్న అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్‌ దార్శనికత మేరకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. ప్రధాన వేదిక వద్ద బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని రోడ్డు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆవరణ వద్ద సుందరీకరణ, మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ నిర్వహిణకు పకడ్భందీ ఏర్పాటు చేయాలన్నారు.

Jyothi

Jyothi

Next Story