YS Sharmila: వైఎస్‌ షర్మిల పార్టీ పేరు దాదాపు ఖరారు

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)గా నామకరణం..!

Sandeep Eggoju
Updated on: 10 March 2021 8:39 PM IST
Almost Finalized YS Sharmilas New Party Name
X

వైఎస్ షర్మిల (ఫైల్ ఇమేజ్) 

YS Sharmila: వైఎస్‌ షర్మిల పార్టీ పేరు దాదాపు ఖరారైంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయడంతో ఈ వారంలోనే ఈసీ అనుమతి వస్తుందని షర్మిల అనుచరులు చెబుతున్నారు. ఇక, మూడు రంగులు ఉండేలా జెండా రూపకల్పన చేస్తున్నారు. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో షర్మిల పార్టీ జెండా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించబోయే భారీ బహిరంగస సభలో పార్టీ జెండాను వైఎస్ షర్మిల ఆవిష్కరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న షర్మిల ఖమ్మం అండ్ హైదరాబాద్‌ నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story